ఈ రోజు లాహోర్ లో శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చినా వెంట వెంటనే మూడు కీలక వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉన్న శ్రీలంకను కీపర్ కుషాల్ మెండిస్ అసలంక తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కానీ స్వల్ప వ్యవధిలో అసలంక, మెండిస్ , డిసిల్వా మరియు శనకలు వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక దారుణమైన స్థితికి చేరుకుంది. వాస్తవానికి శ్రీలంక కుదురుకున్న సమయంలో కు పైగానే స్కోర్ సాధిస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు 300 అయినా చేరుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఆఫ్ఘన్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే శ్రీలంక ఇచ్చిన టార్గెట్ ను 36 ఓవర్ లలో చేధించాల్సి ఉంది. మరి ఆఫ్ఘన్ ఈ మ్యాచ్ లో గెలిచి సూపర్ 4 కు అర్హత సాధిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.