ఈ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. కీలక ప్రకటన..!

-

ఈరోజుల్లో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి ఇప్పటికి ట్రాన్సాక్షన్ల కోసం చెక్కలను ఇస్తున్నారు. అయితే మోసగాళ్లు దీనినే అదునుగా తీసుకున్నారు చెక్కుల మోసాలకి పాల్పడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల క్రితం పాజిటివ్ పే సిస్టం ని ఈ మోసాలని ఆపడానికి అందుబాటులోకి తెచ్చింది చెక్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడం చేక బదిలీ చేయడం వంటి పద్ధతుల ద్వారా మోసాలకి బ్రేక్ వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పాజిటివ్ పే సిస్టం ని అమలు చేస్తోంది. చెక్ ద్వారా మోసాలని ఆపడానికి దీనిని తీసుకువస్తుంది పాజిటివ్ పే సిస్టంలో చెక్కులోని వివరాలు బ్యాంకుల కి తిరిగి ధ్రువీకరించాలి. చెక్ ని ప్రాసెస్ చేసి చెల్లింపులు జరిపే టైంలో ఈ వివరాలని బ్యాంకు క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మోసాలు ఆగుతాయి అకౌంట్ రిజిస్ట్రేషన్, లాడ్జ్మెంట్ ఆఫ్ చెక్ వంటివి ఉంటాయి. ఈ సిస్టమ్ ని ఉపయోగించుకోవాలంటే కస్టమర్లు తగిన ఫార్మేట్ లో దరఖాస్తు ని బ్యాంకు లో సబ్మిట్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి.

ఈ రిజిస్ట్రేషన్స్ ని మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు అకౌంట్లో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉంటే పాజిటివ్ పే సిస్టం తప్పనిసరి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇలా చేయడం వలన చెక్కు మోసాలు జరగవు. అనవసరంగా మీరు మీ డబ్బులు కోల్పోకుండా ఉంటారు

Read more RELATED
Recommended to you

Latest news