వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు.
అయితే.. టిడిపి అధినేత చంద్రబాబుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. దోమల నియంత్రణకు ‘దోమలపై దండయాత్ర’ పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు చేసిన కార్యక్రమం వల్లే… ఇప్పుడు దోమలు పగ తీర్చుకుంటున్నాయా అని ఆర్జీవి ప్రశ్నించారు. ‘ఇది రక్త చరిత్ర కాదు… దోమ చరిత్ర’ అంటూ బాబు వీడియోను షేర్ చేశారు.
మరో పోస్ట్ లో రూల్స్ పాటించకుండా , C B N స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి , తన సన్నిహితులని సిఈఓ, డైరెక్టర్, ఎండీ లుగా నియమించి ఒక అధికారక జీవో రిలీజ్ చేసారు. ఆ తర్వాత ఎంఓయూ కుదుర్చుకున్నారు. కాని అప్పుడు చాలామందికి తెలియనిది ఏంటంటే జీవోలో ఉన్నది వేరు, ఎంఓయూలో ఉన్నది వేరని తెలిపారు ఆర్జీవీ.