‘నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు’.. బాక్సర్ మేరీకోమ్ క్లారిటీ

-

మణిపుర్‌ స్టార్‌ మహిళ మేరీకోమ్‌ బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా మేరీకోమ్ స్పందించింది. తాను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని కొట్టిపారేసింది. ఆటకు వీడ్కోలు పలికినట్లు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది.

“నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. అవన్నీ అబద్దం. నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఆటకు గుడ్బై చెప్పాలనుకున్నప్పుడు నేనే మీడియా ముందుకు వచ్చి చెబుతా. రీసెంట్గా ఓ స్కూల్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు పిల్లల్ని ప్రోత్సహిస్తూ, ‘నాకు స్పోర్ట్స్లో ఇంకా అనేక ఘనతలు సాధించాలని ఉంది. కానీ, ఏజ్ లిమిట్ వల్ల నేను ఒలింపిక్స్లో పాల్గొనే ఛాన్స్ లేదు. అయినప్పటికీ నేను నా ఫిట్నెస్పైనే దృష్టి సారిస్తున్నా’ అని చెప్పాను. దాన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చినప్పుడు అందరికీ చెబుతా’ అని ఈ స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అసలు సంగతి చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news