మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా కొత్త బ్రాండ్స్

-

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయంతో కొత్త రకం మద్యం బ్రాండ్లు రానున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లను ఆహ్వానిస్తూ తెలంగాణ బెవరేజేస్ కార్పొరేషన్ లిమిటేడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కి 92 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. దాదాపు 15 రోజుల్లో అనుమతుల ప్రక్రియ సిద్ధం చేసేందుకు ఎక్సైజ్ శాఖ సమయత్తం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కంపెనీలకు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు.

రాష్ట్రంలో సరఫరాలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ల కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఫిబ్రవరి 23న టీజీబీసీఎల్ ప్రకటన చేసింది. టీజీబీసీఎల్ నోటిఫికేషన్ కు దేశీయ, విదేశాలకు చెందిన 92 కంపెనీలు, 604 బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. 92 కంపెనీల్లో 45 కంపెనీలు టీజీబీసీఎల్ కి సరఫరా చేస్తున్న కంపెనీలు కావడం గమనార్హం. 45 కంపెనీల్లో 32 దేశీయ కంపెనీలు, 13 విదేశీ కంపెనీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news