హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతీ మ్యాచ్ కు దాదాపు 10 వేల మంది వరకు ఫ్రీ ఎంట్రీ చేయనుంది. మార్చి 1 నుంచి 3 వరకు..మూడు రోజుల్లో 6 మ్యాచ్ లు జరుగనున్నాయి. లీగ్ లో ఆడనున్న టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ కి చెందిన పలువురు సినీ స్టార్స్.
ఈ మ్యాచులకు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఫ్రీ ఎంట్రీ..ప్రతీ మ్యాచ్ కి 10 వేల మందికి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆసక్తి కలిగిన కాలేజ్ యాజమాన్యాలు hca.ccl2024@gmail.com కి మెయిల్ చేయాలని hca సూచన