ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో తొలుత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
ముఖ్యంగా లక్నో బ్యాటర్లు మిచెల్ మార్ష్ 30, మార్క్రమ్ 06, నికోలస్ పూరన్ 08, రిషబ్ పంత్ 38, బదోనీ 22, అబ్దుల్ సమద్ 20 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 1, కంబోజ్ 1, జడేజా 2, పతిరానా 2 వికెట్లను తీాశారు. మొత్తానికి ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కచ్చితంగా విజయం సాధించేటట్టు కనిపిస్తోంది. చెన్నై టార్గెట్ 167 పరుగులు.. అలవొకగా ఛేజింగ్ చేస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు.