దొరలు, భూ స్వాముల కోసమే ధరణి : మంత్రి పొంగులేటి

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న భూభారతి పోర్టల్ కొద్ది సేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం భూ సవరణలు చేపడుతామని ధరణి పేరుతో భూపందెరానికి తెగబడ్డారని పేర్కొన్నారు. దొరలు, భూస్వాముల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణీని తీసుకొచ్చిందని అది వారికి మాత్రమే ప్రయోజనాలు చేకూర్చిందని తెలిపారు.

రైతులకు ఏ మాత్రం ఉపయోగపడలేదని.. పలు అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. తమ భూములు ఎప్పుడు ఏమవుతాయో తెలియక కంటిమీద కుణుకు కూడా లేకుండా ప్రజలు గడిపారని పేర్కొన్నారు. ధరణి అరాచకాల ఫలితం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలందరూ చూశారని వెల్లడించారు. భూ భారతి పోర్టల్ తో ఒకేసారి లక్షల మంది లాగిన్ అయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఎప్పటికప్పుడు పోర్టల్ లో అవసరమైన మార్పులు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news