డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సతీసమేతంగా వెళ్లిన హీరో అల్లు అర్జున్…. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుణ్ణి పరామర్శించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కిమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో పవన్ కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసారు బన్నీ, స్నేహ. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లిన ఫోటోలు బయటకు రాలేదు.
- ఏపీ డిప్యూటీ సీఎం ఇంటికి ఐకాన్ స్టార్..
- సతీసమేతంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
- ఇటీవల సింగపూర్ అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన నేపథ్యంలో పవన్ కుటుంబాన్ని పరామర్శించి, శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు సమాచారం