టెన్నిస్ ప్లేయర్ ను చంపిన తండ్రి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హర్యానాలో 25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ గన్ తో కాల్చి చంపారు. రాధిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ లో 113 వ స్థానంలో ఉంది.

అయితే ఇటీవల టెన్నిస్ అకాడమీ ప్రారంభించిన రాధిక అనతి కాలంలో తన కోచింగ్ తో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. దీంతో ఇరుగుపొరుగు వారు దీపక్ యాదవ్ ను కూతురు సంపాదనతో బతుకుతున్నావా అది ఓ బతికేనా అని చాలామంది ఎగతాళి చేయడంతో విసిగిపోయిన దీపక్ యాదవ్ తన కూతురిని గన్ తో కాల్చి చంపారు.