కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు..వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఈ విచారణ అనంతరం హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరానికి సంబంధించి నా దగ్గర ఉన్న పూర్తి సమాచారం కమిషన్ కు ఇచ్చానన్నారు హరీష్ రావు. బ్యారేజ్ లకు సంబంధించి ఆరుసార్లు కేబినెట్ లో నిర్ణయాలు జరిగాయని పేర్కొన్నారు.

మూడు సార్లు శాసనసభలో ఆమోదం పొందాయని చెప్పారు. అన్ని ఆధారాలతో కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చానన్నారు హరీష్ రావు. ప్రభుత్వం నిజంగా వివరాలు ఇచ్చిందా లేదా అన్నది నాకు తెలీదు… ఒకవేళ ప్రభుత్వం వివరాలు ఇస్తే అవి మాకు కూడా ఇవ్వాలని కోరామన్నారు హరీష్ రావు.
కృష్ణా నదిలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం చేశాడన్నారు. మన లాయర్లు, అధికారులు 763 టీఎంసీల కోసం కోట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి 500 టీఎంసీలు చాలు అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 563 టీఎంసీలు చాలు అంటున్నాడని చెప్పారు.