కోహ్లీ కోసం మరో రికార్డు వేయిటింగ్..!

-

టీమిండియా- ఆస్ట్రేలియా రేపే ప్రారంభం కానున్నాయి. సిడ్నీ వేదికగా తొలి రెండు వన్డేలు జరుగుతాయి. కాన్‌బెర్రాలో మూడో వన్డే జరుగనుంది. ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. చలి కాలంలో వేడి పుట్టించనున్న ఈ టోర్నీ ముంగిట ఇరు జట్ల విజయాల ట్రాక్​ రికార్డు బాగానే ఉంది.

kohli
kohli

ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌కు రంగం సిద్ధమైంది. పరుగుల మెషీన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డుకు చేరువగా ఉన్నాడు. వన్డేల్లో 12 వేల పరుగులు సాధించడానికి కోహ్లీ 133 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్ అందుకు వేదిక కానుందని అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఆసీస్‌తో 133 పరుగుల్ని సాధిస్తే వన్డేల్లో 12వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న ఆరో క్రికెటర్‌గా వీరాట్ కోహ్లీ నిలుస్తాడు. అంతే కాకుండా 300 ఇన్నింగ్స్‌లు కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.

వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకూ ఆడిన 248 మ్యాచ్‌లకు గాను 239 ఇన్నింగ్స్‌ల్లో 11,867 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కోహ్లి యావరేజ్‌ 59.34గా ఉండగా, స్టైక్‌ రేట్‌ 93.25గా ఉంది. మూడు వన్డేల సిరీస్‌, మూడు టీ20ల సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు అందుబాటులో ఉండే కోహ్లి.. చివరి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి పయనం అవుతాడని సమాచారం. అదే సమయానికి భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో తొలి టెస్టు తర్వాత కోహ్లి భారత్‌కు బయల్దేరతాడని సన్నిహిక వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news