ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చోటే భాయ్.. నరేంద్ర భాయ్ బడే భాయ్ అని… చోటే భాయ్‌కి ఓటు వేసిన నరేంద్ర మోడీకి ఓటు వేసిన ఒక్కటే.. ఎవరికి ఓటు వేసిన మోటార్లకు మీటర్లు పెడుతారని ఫైర్ అయ్యారు కేసీఆర్. మహబూబ్ నగర్ రోడ్ షో కేసీఆర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులారా తెలంగాణలో ఇప్పటి వరకు మేము సెక్యులర్ ప్రభుత్వం నడిపించాం.
ఇప్పటి వరకు సెక్యులర్‌గా ఉన్నాం, ప్రాణం పోయిన సెక్యులర్‌గానే ఉంటామన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మేము ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇచ్చే వాళ్లం.. ఈసారి ఈ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చిందా మీకు? అని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నమాజ్ చదివే ఇమామ్ లకు జీతాలు ఇచ్చాం.. ఈ బడే భాయ్, చోటే భాయ్ ఒక్కటే. ఆలోచించి ఓటు వేయండి ముస్లిం సోదరులారా ? అని కేసీఆర్ పేర్కొన్నారు.