T 20 World Cup Semi Final : టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ! పాక్ బ్యాటింగ్ కు రెడీ

-

దుబాయ్ వేదిక‌గా టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ల మ‌ధ్య జ‌రుగుతంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ టాస్ నెగ్గి.. బౌలింగ్ ఎంచు కున్నాడు. దీంతో పాకిస్థాన్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా కీల‌క మైంది టాస్ మాత్ర‌మే. టాస్ నెగ్గిన వారే మ్యాచ్ గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇప్ప‌టి వ‌రకూ ఎక్కువ మ్యాచ్ ల లో ఇలాగే జ‌రిగింది. ఈ మ్యాచ్ లో కూడా టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు విజ‌యం సాధించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా న్యూజిలాండ్ తో ఫైన‌ల్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ రెండో సెమీ ఫైన‌ల్ కు రెండు తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు : ఆరోన్ ఫించ్ ( కెప్టెన్ ), డేవిడ్ వార్న‌ర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, మార్క‌స్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ ( వికెట్ కీప‌ర్‌), పాట్ క‌మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడ‌మ్ జంపా, జోష్ హేజిల్ వుడ్.

పాకిస్థాన్ తుది జ‌ట్టు : బాబ‌ర్ ఆజం ( కెప్టెన్), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ( వికెట్ కీప‌ర్) , ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌, మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్, షోయ‌బ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్‌, ఇమాద్ వ‌సీం, హ‌స‌న్ అలీ, హారీస్ ర‌వూఫ్, షాహీన్ అఫ్రిది.sx

Read more RELATED
Recommended to you

Exit mobile version