కోహ్లీ, రోహిత్ లకు బిసిసిఐ వార్నింగ్.. మీకు బుద్ధి ఉందా!

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమిండియా యూకే వెళ్లిన విషయం తెలిసిందే. ఒక టెస్ట్, 3 టి-20 లు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత ఆటగాళ్లు రెండు బృందాలుగా వెళ్లారు. అయితే ఇప్పటికే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా కారణంగా జట్టుతో పాటు వెళ్లలేకపోయాడు.

ఇది చాలదన్నట్టు లండన్ లో ల్యాండ్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాస్కులు లేకుండా షాపింగ్ అంటూ అక్కడి వీధుల్లో చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా అభిమానులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. ఆటగాళ్లకు కరోనా సోకితే మరోసారి సిరీస్ ప్రమాదంలో పడుతుందని బిసిసిఐ ఈ ఇద్దరిపై గుర్రుగా ఉందట. యూకేలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడం పై బీసీసీఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version