వరల్డ్ కప్ లో పాల్గొన్న పది జట్లలో ఆరు జట్లు ఇంటి ముఖం పట్టాయి. అద్భుతమై ప్రదర్శన చేసిన మొదటి నాలుగు జట్లు మాత్రమే సెమీస్ కు అర్హత సాధిస్తాయి, అందులో భాగంగా ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లు సెమీస్ చేరగా, ఆఖరి స్థానం ఒక్కటే పెండింగ్ లో ఉంది. మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్ తో అది కూడా కంఫర్మ్ అయిపోతుంది. కాగా ఇప్పుడు లీగ్ లో చివరి మ్యాచ్ ను ఆస్ట్రేలియా మరియు బంగ్లాదేశ్ లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట ఫిల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేయనున్న బంగ్లాదేశ్ బలమైన ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ ను ఉంచి వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ ను విజయంతో ముగిస్తుందా అన్నది చూడాలి.
గత మ్యాచ్ లో శ్రీలంక పై జరిగిన వివాదం పట్ల బంగ్లాదేశ్ విమర్శలలో ఉంది. ఇప్పుడు ఈ రోజు గెలిస్తే ఆ వివాదం కాస్త అయినా మరిచిపోయే అవకాశం ఉంటుంది. మరి ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.