ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. 80 ఏళ్ల చంద్రమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్‌.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

1966లో రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్‌ అరంగేట్రం చేసి.. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా.. 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. చంద్రమోహన్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఓ విలక్షణ నటుడిని కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు.

బంగారు పిచుక, ఆత్మీయులు, తల్లిదండ్రులు, బొమ్మబొరుసు, రామాలయం, కాలం మారింది, జీవనతరంగాలు, అల్లూరి సీతారామరాజు, ఓ సీత కథ, యశోద కృష్ణ, సెక్రటరీ, పాడిపండటలు, కురుక్షేత్రం, ఖైదీ కాళిదాసు, దేవతలారా దీవించండి, ప్రాణం ఖరీదు, సీతామాలక్ష్మి, శంకరాభరణం,తాయారమ్మ, బంగారయ్య, ఇంటింటి రామాయణం, కొరికలే గుర్రాలైతే, మంగళ తోరణాలు, సంఘం చెక్కిన శిల్పాలు, నాగమల్లి, గయ్యాళి గంగమ్మ, శుభోదయం, పక్కింటి అమ్మాయి, ప్రియ, కలహాల కాపురం, కొత్తనీరు, సంతోషిమాత వ్రతం, మూడు ముళ్లు, ఇంటి గుట్టు వంటి సినిమాల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version