భారతదేశాన్ని కరోనా వైరస్ వెంటాడుతుంది. ఈ రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే దీని ప్రభావం భారత్ – వెస్టిండీస్ మధ్య జరగబోయే సిరీస్ పై పడింది. వచ్చె నెల 6 వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన భారత్ – వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు జరిగి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం వన్డే, టీ 20 సిరీస్ ల కోసం మొత్తం ఆరు వేర్వేరు వేదికలు ఉన్నాయి.
కానీ కరోనా కారణంగా ఆరు వేదికలలో సిరీస్ ను నిర్వహించడం ప్రమాదం అని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఆరు వేదికలను కేవలం రెండు వేదికలకు కుదించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ సిరీస్ షెడ్యూల్ లో కాస్త మార్పులు జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగ టీమిండియా సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత స్వదేశానికి చేరుకుంటుంది. దీని తర్వాత వెస్టిండీస్ భారత పర్యటన కు రానుంది.