ind vs rsa 2nd test : సౌతాఫ్రికా బ్యాట‌ర్ అవుట్ పై వివాదం

-

ఇండియా సౌత్ ఆఫ్రికా మ‌ధ్య టెస్ట్ సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ రోజు రెండో రోజు ఆట కొన‌సాగుతుంది. అయితే ఈ రోజు ఆటలో శార్ధుల్ ఠాకూర్ బౌలింగ్ లో సౌత్ ఆఫ్రికా ఆట‌గాడు ర‌సే వాన్ డెర్ డ‌సెన్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఈ అవుట్ పైనే ఇప్పుడు వివాదం జ‌రుగుతుంది. అయితే ఇది అవుట్ కాద‌ని కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు. అంపర్ నిర్ణ‌యం త‌ప్ప‌ని అంటున్నారు. వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ క్యాచ్ తీసుకునే స‌మ‌యంలో బంతి నేల‌ను తాకింద‌ని అంటున్నారు.

దీని పై సౌతాఫ్రికా జ‌ట్టు మేనేజ‌ర్ ఖొమొత్సొ మ‌సుబెలెలె తో కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ డ‌సెన్ అవుట్ పై చ‌ర్చించారు. అంతే కాకుండా వీరు అంప‌ర్ల‌తో కూడా చ‌ర్చించారు. కాగ డ‌సెన్ అవుట్ అయ్యే స‌మ‌యంలో ఒక కెమెరాలో కీప‌ర్ చేతిలో ప‌డ‌క ముందే నేల‌కు తాకింద‌ని తెలుస్తుంది. దీని పై టీమిండియా మాజీ ఆట‌గాడు సునిల్ గావ‌స్క‌ర్ కూడా స్పందించాడు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో మెలైన నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌ష్ట మ‌ని అన్నారు. బంతి నేలకు తాకిందో.. లేదో వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ కు తెలిసి ఉంటుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version