ఇంగ్లండ్ తో టీ ట్వంటీల నుండి బుమ్రా తప్పుకోవడంపై వైరల్ అవుతున్న కారణాలు…

-

ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచులకి ఆడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, టీ ట్వంటీలకి మాత్రం ఆడట్లేదు. ఇంగ్లండ్ తో జరిగే టీ ట్వంటీలకి హాజరు కాలేనంటూ సెలవు తీసుకోవడంతో అనేక కారణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానమైన కారణం ఏమైనా ఉందంటే అది పెళ్ళి. అవును, బుమ్రా పెళ్ళి చేసుకోబోతున్నాడని, అందుకే టెస్ట్ మ్యాచులకి మాత్రమే హాజరయ్యి, ఆ తర్వాత జరగబోయే టీ ట్వంటీలకి హాజరు కావట్లేదని అంటున్నారు. గాయాల పాలు కాకుండా మ్యాచులకు గైర్హాజరు అవుతున్నాడంటే పెళ్ళే కారణం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అప్పట్లో బుమ్రా, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మధ్య ప్రేమ గురించి అనేక కథనాలు వచ్చాయి. అవన్నీ నిజమో కాదో ఎవరికీ తెలియదు. ప్రస్తుతమైతే బుమ్రా పెళ్ళి చేసుకుంటున్నాడనే అంటున్నారు. మరి నెట్టింట్లో వస్తున్న ఈ కారణాలు నిజమేనా కావా అన్నది తెలియాలంటే బుమ్రా మళ్ళీ జట్టులోకి వస్తేనే తెలుస్తుంది. టీ ట్వంటీలకి ఆడకపోయినా వన్డే సిరీస్ వరకి జట్టులోకి వస్తాడని అంటున్నారు. మరి బుమ్రా పెళ్ళి చేసుకుంటున్నాడా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version