రవిశాస్త్రి వల్లే విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడు: పాక్ మాజీ క్రికెటర్

-

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడానికి కారణం టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడమే అని అన్నాడు పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్. 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్ గా ఉన్న రవి శాస్త్రికి.. భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలిగే అనుభవం లేదని చెప్పాడు. శాస్త్రి కోచ్ కాకపోయి ఉంటే కోహ్లీ ఫామ్ కోల్పోయి ఉండేవాడు కాదని అభిప్రాయపడ్డారు.

రెండేళ్లుగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. 2019 నవంబర్ నుంచి ఏ ఫార్మాట్లలోనూ సెంచరీ నమోదు చేయలేదు.” కుంబ్లే లాంటి ఆటగాడిని తప్పించారు. రవి శాస్త్రి కోచ్ గా వచ్చాడు. అతడికి ఆ అర్హత ఉందో లేదో నాకు తెలియదు. శాస్త్రిని నియమించడంలో కోహ్లీ కాకుండా ఇతర వ్యక్తుల పాత్ర కూడా ఉందని భావిస్తున్నా. అతను ఒక వ్యఖ్యాత. కోచింగ్ లో ఎలాంటి అనుభవం లేదు. అదే ఇప్పుడు బెడిసి కొడుతుంది. అతడు కోచ్ కాకపోయి ఉంటే కోహ్లీ ఫామ్ కోల్పోయి ఉండేవాడు కాదు”. అంటూ వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news