రాంచీ వేదిక గా న్యూజిలాండ్ తో టీమిండియా రెండో టీ ట్వంటి ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ ఓడీ మొదట బ్యాటింగ్ చేస్తుంది. అయితే న్యూజిలాండ్ ఓపెనర్ ఈ మ్యాచ్ లో అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ టీ ట్వంటి క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా మార్టిన్ గప్టిల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో మార్టిన్ గప్టిల్ అద్భుత మైన ఫామ్ లో ఉన్నాడు.
ముఖ్యంగా ఇటీవల జరిగిన టీ ట్వంటి ప్రపంచ కప్ లో మార్టిన్ గప్టిల్ అద్బుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం టీమిండియా తో జరుగుతన్న టీ 20 సిరీస్ లో కూడా గప్టిల్ పరుగులు చేస్తున్నాడు. దీంతో ఈ రికార్డు ను తన పేరుట రాసుకున్నాడు. కాగ మొదటి స్థానంలో ఉన్ గప్టిల్ 111 మ్యాచ్ లలో 3248 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి 95 మ్యాచ్ లలో 3227 పరుగులు చేశాడు. మూడో స్థానం లో ఉన్న టీమిండియా టీ ట్వంటి కెప్టన్ 118 మ్యాచ్ లో 3086 పరుగులు చేశాడు.