ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిత్తూర్, నెల్లూర్ తో పాటు కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షలు పడుతున్నాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ రంగం లో కి దిగాడు. రేపు ఆయా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయనున్నాడు. భారీ వర్షాలతో దెబ్బ తిన్న ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నాడు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎంవో తెలిపింది.
రేపు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కడప చేరుకుంటురు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వర్ష ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహిస్తాడు. అలాగే ఈ ఏరియల్ సర్వే కు ముందు ఆ చిత్తూర్, కడప, నెల్లూర్ జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాడు. ఆయా జిల్లాలో పరిస్థితులను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి తెలుసు కోనున్నారు. కాగ ఆంధ్ర ప్రదేశ్ లో వర్ష బీభత్సం ఇంకా తగ్గలేదు. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది.