హార్దిక్ పాండ్యా భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కావొచ్చు: సునీల్ గవాస్కర్

హార్దిక్ పాండ్యా తప్పనిసరిగా సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీకి పోటీదారు కావొచ్చని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం తన ఒక్కడి అంచనా కాదని.. అందరిదీ గా పేర్కొన్నారు. హార్దిక్ తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు కెప్టెన్సీ పోటీలో ఉన్నారని అన్నారు. అయితే టీమిండియాకు పాండ్యా నే తదుపరి కెప్టెన్ అని చెప్పలేనని అన్నారు. కానీ సెలక్షన్ కమిటీ కి పాండ్యా రూపంలో చక్కటి ప్రత్యామ్న్యాయం కనిపిస్తోందని అన్నారు.

నాయకత్వ లక్షణాలు ఉంటే టీమిండియా జాతీయ జట్టుకు సారథ్యం వహించే అవకాశం తప్పనిసరిగా లభిస్తోందని స్టార్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కాగా ఐపీఎల్ 2022 టోర్నీలో హార్దిక్ పాండ్యా.. 8 వికెట్ల సాధించడంతోపాటు 487 పరుగులు సాధించాడు. తొలి సీజన్ లోనే గుజరాత్ ను ఛాంపియన్ గా నిలిపిన పాండ్యా లో నాయకత్వ లక్షణాలను పలువురు మాజీ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. టీమిండియాకు బావి కెప్టెన్ హార్దిక్ పాండ్యా గా కొనియాడుతున్నారు.