ఐసీసీ మెగా టోర్నీల చరిత్రలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా గెలుపు మరోసారి కొనసాగింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. ‘సండే-బ్లాక్ బస్టర్’గా నిలిచిన మ్యాచ్ పలు రికార్డులు సృష్టించింది. ప్రత్యక్షంగా మెల్బోర్న్ మైదానంలో వీక్షించిన అభిమానుల సంఖ్య 90 వేలకుపైనే. కొన్ని నగరాల్లో ఏకంగా సినిమా హాల్స్‌లోనే ప్రత్యేకంగా మ్యాచ్‌ను చూసేందుకు ఏర్పాట్లు చేయడం గమనార్హం.
మరోవైపు.. మ్యాచ్‌ను లైవ్ ఇచ్చిన డిస్నీ-హాట్‌స్టార్ యాప్ వ్యూవర్షిప్లో క్రేజీ రికార్డు సృష్టించింది. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు దాదాపు 1.40 కోట్ల వ్యూవర్ షిప్ రాగా.. ఈసారి మాత్రం 1.80 కోట్లను దాటేసిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి.
తొలుత బ్యాటింగ్‌కు పాక్ దిగిన సందర్భంలో హాట్‌స్టార్ యాప్‌లో 36 లక్షల మంది భువీ వేసిన మొదటి బంతి నుంచి లైవ్‌లో వీక్షించారని పేర్కొన్నాయి. పాక్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆ సంఖ్య 1.1 కోట్లకు చేరింది. ఇన్నింగ్స్ బ్రేక్ నాటికి 1.4 కోట్లకు పెరగగా.. టీమ్ ఇండియా ఛేదనలో తొలి బంతిని 40 లక్షల మంది వీక్షించారు. ఛేజింగ్ చివరికి వీక్షకుల సంఖ్య 1.80 కోట్లకు చేరుకొని రికార్డు నమోదు చేసింది.