IND vs WI : భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ.. సిరీస్ కైవ‌సం

-

వెస్టిండీస్ తో జ‌రుగుత‌న్న రెండో వ‌న్డే మ్యాచ్ లో టీమిండ‌యా గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ ను 2-0 తేడాతో మ‌రో మ్యాచ్ ఉండ‌గానే సొంతం చేసుకుంది. కాగ బుధ‌వారం అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోడీ మైదానంలో జ‌రిగిన రెండో వ‌న్డేలో వెస్టిండీస్ ను టీమిండియా 44 ప‌రుగుల తేడాతో ఓడించింది. కీల‌క‌మైన టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణ‌త ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌ను కోల్పోయి 237 ప‌రుగులు చేసింది.

కెఎల్ రాహుల్ (49), సూర్య కుమార్ యాద‌వ్ (64) రాణించారు. అనంత‌రం 238 ప‌రుగ‌ల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్.. భార‌త బౌల‌ర్లు ఆట ఆడేశారు. 32 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ ప‌డ‌గొట్టిన త‌ర్వాత కీల‌కమైన వికెట్ల‌ను వ‌రుసగా తీశారు. దీంతో వెస్టిండీస్ 76 పరుగుల వ‌ద్ద 5 వికెట్లు కోల్పోయింది. భార‌త బౌల‌ర్ల దాటికి ఎక్క‌డ కూడా పోటీ ఇవ్వ‌లేదు. దీంతో వెస్టిండీస్ 46 ఓవ‌ర్ల‌లో 193 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

యువ సంచ‌ల‌నం ప్ర‌సిద్ధ కృష్ణ 9 ఓవ‌ర్లు వేసి కేవ‌లం 12 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అలాగే కీల‌క‌మైన 4 వికెట్లను ప‌డ‌గొట్టాడు. అలాగే మూడు ఓవ‌ర్ల‌లో ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌లేదు. అలాగే శార్ధుల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. సిరాజ్, చాహ‌ల్, దీప‌క్ హుడా, సుంద‌ర్ ఒక్కోక్క వికెట్ చొప్పున తీశారు. ఈ మ్యాచ్ లో 9-3-12-4 తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప్రసిద్ధ కృష్ణకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news