భారత్ టూర్ కు వచ్చిన న్యూజిలాండ్ తో టీమిండియా మొదటి టీ ట్వంటి మ్యాచ్ ను ఈ రోజు జైపూర్ వేదిక గా ఆడుతుంది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గారు. దీంతో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదట బ్యాటింగ్ చేయడానికి అతిథ్య న్యూజిలాండ్ జట్టు సిద్ధం అవుతుంది. టీమిండియా తుది జట్టు లో ఐపీఎల్ హీరో వెంకటేష్ అయ్యార్ ఆడుతున్నాడు. అలాగే చాలా రోజుల తర్వాత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడుతన్నాడు. ఈ మ్యాచ్ లో తుది జట్టు లు ఇలా ఉన్నాయి.
టీమిండియా : రోహిత్ శర్మ ( కెప్టెన్ ) కెఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్ ), వెంకటేష్ అయ్యర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భూవనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సీరాజ్
న్యూజిలాండ్ : టీమ్ సౌథీ (కెప్టెన్ ), మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లాన్ ఫిలిప్స్, టీమ్ సీఫెర్ట్ ( వికెట్ కీపర్ ), రచిన్ రవీంద్ర, మిచెల్ శాన్ టర్న్ , టాడ్ ఆస్టల్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్