‘ వయలెన్స్ లైక్స్ మీ’ అంటున్న డేవిడ్ భాయ్…. కేజీఎఫ్ డైలాగ్ తో వార్నర్ రచ్చ

-

డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు. ఒక్క సారి క్రీజ్ లోకి దిగి నిలదొక్కుకున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు బౌండరీల వైపు చూడాల్సింది. డేవిడ్ వార్నర్ కు స్వదేశం ఆస్ట్రేలియా అంటే ఎంత ఇష్టమో… భారత్ అన్నా కూడా ఎనలేని అభిమానం. ఇండియాను తన సెకండ్ హోమ్ గా భావిస్తుంటారు. ఇక ఐపీఎల్ ప్రారంభం అయిన తర్వాత నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎక్కువగా ఇండియాలోనే గడుపుతున్నారు. ఇక్కడి కల్చర్, సినిమాలకు బాగా అట్రాక్ట్ అయ్యారు. 

గతంలో సన్ రైజర్స్ తరుపున ఆడిన డేవిడ్ వార్నర్ ఈ సారి ఢిల్లీ తరుపున బరిలో దిగుతున్నాడు. గతంలో ఎన్నో తెలుగు, తమిళ సినిమా డైలాగ్స్, సాంగ్స్ తో రీల్స్, టిక్ టాక్ చేస్తూ తన ఫ్యాన్స్ కు వినోదం పంచాడు. క్రికెట్ తో పాటు యాక్టింగ్ టాలెంట్ కూడా వార్నర్ భాయ్ కు ఎక్కువే అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. గతంలో ‘ అల వైకుంఠపురం’ సినిమా బుట్టబొమ్మ సాంగ్ కు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి తెగ హంగామా చేసిన సంగతి తెలిసిందే. ‘ పుష్ప’ సినిమాలో క్రేజీ డైలాగ్ ‘ తగ్గదే లే’ అంటూ తన మార్క్ చూపించారు.

తాజాగా డేవిడ్ వార్నర్ కేజీఎఫ్ 2 డైలాగ్ తో రచ్చ చేశాడు. వయలెన్స్ లైక్స్ మీ అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పాడు. దీనికి తన బ్యాటింగ్ వీడియోలు కూడా మిక్స్ చేసి డైలాగ్ తో ఆకట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version