Bindu Madhavi: పోటీకొస్తే ఎదిరించే దమ్ము..తప్పయితే మాట్లాడే దిల్ ఉందంటున్న బిందు మాధవి

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఐదు సీజన్స్ ను పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నెక్స్ట్ సీజన్ ఓటీటీ వర్షన్ గా రూపొందించారు. ఈ షోకు హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఏడో వారం ఓటీటీ షోలో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రతీ ఒక్కరు తమ గేమ్ పైన పూర్తిగా దృష్టి పెట్టారు.

హౌజ్ లో మొదటి నుంచి బిందు మాధవి చాలా యాక్టివ్ గా ఉంటోంది. బీబీ లవర్స్ ఆమె గేమ్ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఓటింగ్ పర్సంటేజీ కూడా బాగానే వస్తోంది. మిగతా కంటెస్టెంట్స్ అందరితో మంచిగా ఉంటూనే సమయం వచ్చినప్పుడు తన ఆట కోసం వారిని సద్విమర్శ చేస్తోంది బిందు.

ఇకపోతే తనతో గొడవ పడిన వారితో అయినా అవసరమైనప్పుడు తప్పకుండా మాట్లాడుతోంది బిందు మాధవి. తప్పు చేసినట్లు అనిపిస్తే బాధపడాలని, లేదనిపిస్తే తమకు తాముగా నిలబడాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే తనపైన ఎవరు ఆర్గుమెంట్ చేస్తే వెంటనే రిప్లయి ఇచ్చేస్తుంటుంది.

తనతో ‘‘పోటీకొస్తే ఎదిరించే దమ్ముంది..తప్పు అయితే వెళ్లి మాట్లాడే దిల్ ఉంది’’ అని బిందు మాధవి చెప్తోంది. సోషల్ మీడియా వేదికగా బీబీ లవర్స్ బిందు మాధవియే బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ విన్నర్ అని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి.. చివరకు ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version