CSK Vs KKR మ్యాచ్లో ధోనీ-గంభీర్‌ స్పెషల్‌ హగ్‌.. వీడియో వైరల్‌

-

ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జోరు సాగిస్తోంది. సోమవారం రోజున చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదున్న కోల్‌కతాను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ మ్యాచ్లో గెలుపుతో జట్టు మాజీ సారథి ధోనీ ముఖంలో నవ్వులు పూశాయి. సొంత గ్రౌండ్లో హ్యాట్రిక్ కొట్టడంతో ధోనీ ఫుల్ ఖుష్ అయ్యాడు.

ఇక మ్యాచ్‌ అనంతరం ధోనీ, కోల్‌కతా మెంటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో వీరిద్దరి ఆత్మీయ సంభాషణను గమనించిన ఐపీఎల్‌ బ్రాడ్‌ కాస్టర్‌ మ్యాచ్‌కే ప్రత్యేకమైన దృశ్యంగా అభివర్ణించింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇద్దరు గోట్స్ (G.O.A.T) ఒకే ఫ్రేమ్లో కనిపించడం చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ సూపర్‌ హీరోలే. ఆ మ్యాచ్‌లో గంభీర్‌ 97 పరుగులు చేయగా.. ధోనీ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమ్‌ ఇండియాకు ప్రపంచ కప్‌ను అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news