IPL 2022 : హెట్‌మెయర్‌ భార్య ప్రెగ్నెన్సీపై సునీల్ గవాస్కర్ బూతులు !

-

నిన్న రాజస్థాన్‌, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే నేపథ్యంలోనే.. రాజస్థాన్‌ 15 ఓవర్లకు 104-4 తో నిలిచింది. అప్పటికి రవిచంద్రన్‌ అశ్విన్‌ 13, షిమ్రన్‌ హెట్‌ మెయర్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి చివరిక 5 ఓవర్లలో 47 పరుగుల చేయాల్సి ఉంది.

ఆ సమయంలోనే ప్రత్యక్ష ప్రసారం లో కామెంట్రీ చేస్తున్న గవస్కర్‌ హెట్‌ మెయర్‌ ను ఉద్దేశించి.. ఇలా వ్యాఖ్యానించాడు. “Hetmyer’s wife delivered, will Hetmyer deliver for the Royals now?” అని అన్నారు సన్నీ. గవాసర్కర్‌ సరదాగా డెలివర్‌ అనే పద ప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టి నెటిజన్లకు కోపం తెప్పించింది. దీంతో గవాస్కర్‌ వ్యాఖ్యలు నీచంగా ఉన్నాయంటూ.. అవి అభ్యంతరకరం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే కామెంట్రీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌ లో చెన్నై పై రాజస్థాన్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news