IPL 2022 : కోల్‌క‌త్త జ‌ట్టులోకి ఆసీస్ స్టార్ ఓపెన‌ర్

-

ఐపీఎల్ 2022 కోసం కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ ఆరోన్ ఫించ్ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ మెగా వేలంలో అన్ సోల్డ్ గా ఉన్న ఆరోన్ ఫించ్ ను కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్ ఫ్రొంఛైజీ త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. బేస్ ప్రైజ్ కేవ‌లం రూ. 1.5 కోట్ల‌కే స్టార్ ఓపెన‌ర్ ను కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్ సొంతం చేసుకుంది. కాగ కోల్ క‌త్త మెగా వేలంలో ఇంగ్లాండ్ ఆట‌గాడు ఆలెక్స్ హేల్స్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కాగ ఆలెక్స్ హేల్స్.. బ‌యోబ‌బుల్ ఒత్తిడి త‌ట్టుకోలేన‌ని కార‌ణం చెప్పి ఐపీఎల్ నుంచి పూర్తిగా త‌ప్పుకున్నాడు. దీంతో కోల్ క‌త్త మ‌రో ఆట‌గాడిని ఎంచుకోవాల్సి వ‌చ్చింది. దీంతో టీ20 ల‌తో పాటు ఐపీఎల్ లో అద్భుత రికార్డులు ఉన్న ఆరోన్ ఫించ్ పై కోల్ క‌త్త ఫ్రొంఛైజీ క‌ళ్లు ప‌డ్డాయి. దీంతో అతి త‌క్కువ ధ‌ర‌కే స్టార్ ఆట‌గాన్ని కొట్టేసింది.

కాగ ఆరోన్ ఫించ్.. ఆస్ట్రేలియా టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే ఇప్పటి వ‌ర‌కు ఆరోన్ ఫించ్ 88 అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి.. 2,686 ప‌రుగులు చేశాడు. అలాగే రెండు సెంచ‌రీలు, 15 ఆఫ్ సెంచ‌రీలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఐపీఎల్ లో 87 మ్యాచ్ లు ఆడి.. 2 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news