IPL : ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల కోసం.. రిల‌యాన్స్ వ‌ర్స‌స్ అమెజాన్

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ ఆదాయం వ‌చ్చే లీగ్ ల‌లో ఐపీఎల్ ముందు వ‌ర‌సలో ఉంటుంది. అందుకే ఈ లీగ్ ను రిచ్ క్యాష్ లీగ్ అని అంటారు. ఐపీఎల్ లో ఆట‌గాళ్లకు, ఫ్రొంఛైజీల తో పాటు ఐపీఎల్ మ్యాచ్ ల‌ను ప్ర‌సారం చేసే కంపెనీల‌కు కూడా భారీ స్థాయిలో లాభాలు వ‌స్తాయి. అందుకే ఐపీఎల్ లో భాగం కావాల‌ని చూస్తారు. కాగ ఈ ఏడాది జ‌రుగబోతున్న ఐపీఎల్ 2022 తో ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌సార హక్కుల గ‌డువు ముగియ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార హ‌క్కులు.. వాల్డ్ డిస్నీ, స్టార్ ఇండియా, సోనీ గ్రూప్ కార్ప్, జీ ఎంట‌ర్ ప్రైజెస్ వ‌ద్ద ఉన్నాయి.

వీరి ఒప్ప‌దం ఈ ఏడాదితో ముగుస్తుంది. కాగ రాబోయే ఏడాది జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ 2023 కి సంబంధించి ప్ర‌సార హ‌క్కుల‌ను బీసీసీఐ వేలం వేయ‌డానికి సిద్ధం అవుతుంది. ఈ సారి ప్ర‌సార హ‌క్కుల‌ను కొనుగోలు చేయ‌డానికి బ‌డా కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి. ఒక్కో కంపెనీ.. ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల కోసం దాదాపు రూ. 50 వేల కోట్లును వెచ్చించ‌డాని కైనా సిద్ధంగా ఉన్నాయి. ప్ర‌ధానంగా రిల‌యాన్స్ తో పాటు అమెజాన్ కూడా ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కులను ద‌క్కించుకోవ‌డానికి రెడీ ఉన్నాయి. అందు కోసం కోట్ల రూపాయాల‌ను కుమ్మ‌రించ‌డానికి వెనుకాడ‌టం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news