మంత్రి పదవీ ఇస్తే.. పార్టీకే లాభం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ  మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి వస్తుందని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. భువనగిరి ఎంపీ స్థానం కోసం నిద్రహారాలు మాని తాను గెలిపించానని, పార్టీ కోసం ఎంతైనా కష్టపడతానని అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే అది పార్టీకి, ప్రజలకే లాభమని తెలిపారు. మంత్రి పదవీ ఆశించి తాను ఏ పనులు చేయనని వెల్లడించారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తగిన గౌరవం అదే వస్తుందని అన్నారు.

నేడు అసెంబ్లీలో జరిగిన స్పీకర్- జగదీశ్ రెడ్డి అంశం పై స్పంధిస్తూ.. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన స్థానం అని, దానిని ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ ను ప్రశ్నించడం సరికాదని, అతిగా ప్రవర్తించి.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే సస్పెండ్ చేశారని వెల్లడించారు. తాము ఎవరినీ టార్గెట్ చేయబోమని, కాని తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news