ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ళపై పంజాబ్ కెప్టెన్ కే ఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మ్యాచులని మలుపు తిప్పడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇద్దరినీ ఉద్దేశించి కే ఎల్ రాహుల్ సరదాగా మాట్లాడాడు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ మీటింగ్ లో విరాట్ కోహ్లీతో పాటు కే ఎల్ రాహుల్ ఉన్నాడు. ఐతే ఐపీఎల్ లో 5వేల పరుగులకి పైగా సాధించిన వారిని టోర్నమెంట్ ఆడకుండా నిషేధించాలని ఐపీఎల్ యాజమాన్యానికి చెబుతానని అన్నాడు.
దానికి కోహ్లీ అలా రూల్ ఏమైనా ఉందా అంటూ చమత్కరించాడు. ఆటలో ఒకనొక స్థానం వరకే ఉండాలని, ఆ తర్వాత మిగతా వాళ్లకి అవకాశం ఇవ్వాలని, అలా రూల్ పెట్టమని ఐపీఎల్ యాజమాన్యాన్ని కోరతానని కే ఎల్ రాహుల్ తెలిపాడు. 2011 నుండి ఐపీఎల్ ఆడుతున్న కోహ్లీ 5వేల పరుగులు పూర్తి చేసాడు. అటు డివిలియర్స్ కూడా 5వేల పరుగులకి దగ్గరలో ఉన్నాడు.