IPL MI vs DC : అద‌ర‌గొట్టిన ఇషాన్ కిషాన్ ముంబై భారీ స్కోర్ .. ఢిల్లీ టార్గెట్ 178

-

ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు ముంబై ఇండియ‌న్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల ప‌డ్డాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ మొద‌ట బౌలింగ్ చేసింది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ తొలత బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (41), ఇషాన్ కిషాన్ (81 నాటౌట్) శుభారంభాన్ని ఇచ్చారు. మొద‌టి వికెట్ కు 67 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని ఇచ్చారు. కుల్దిప్ బౌలింగ్ లో రోహిత్ అవుగ్ కాగ‌.. అన్మోల్పిత్ సింగ్ (8) తో నిరాశ ప‌ర్చాడు. అలాగే తిలక్ వ‌ర్మ ( 22), పోలార్డ్ (3), టిమ్ డేవిడ్ (12) వెనువెంట‌నే అవుట్ అయ్యారు.

చివ‌ర్లో డేనియ‌ల్ సామ్స్ (7 నాటౌట్ ) గా ఉన్నాడు. అయితే ఓపెన‌ర్ ఇషాన్ కిషాన్ విరోచిత పోరాటం చేశాడు. ఓపెన‌ర్ గా వ‌చ్చిన ఇషాన్ కిషాన్ .. చివ‌రి వ‌ర‌కు క్రీజ్ లోనే ఉన్నాడు. కేవ‌లం 48 బంతుల్లోనే 81 ప‌రుగ‌లు చేశాడు. అందులో 11 ఫోర్లు, 2 సిక్స్ లు కూడా ఉన్నాయి. ఇషాన్ కిషాన్ మొద‌టి నుంచే దూకుడుగా ఆడాడు.

దీంతో ముంబై ఇండియాన్స్ భారీ స్కోర్ చేసింది. ముంబై ఇండియ‌న్స్ నిర్ణ‌త 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్టు కోల్పోయి… 177 ప‌రుగులు చేసింది. కాగ ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 18 ప‌రుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజ‌యం సాధించాలంటే.. 178 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news