MS Dhoni : ఖాకీ చొక్క, పాయింట్ ధోని న్యూ లుక్.. అదిరిపోయిందిగా..!

-

క్రికెట్ రంగంలో మ‌హేంద్ర సింగ్ ధోనికి ప్ర‌త్యేక చరిత్ర ఉంటుంది. ధోని అంటే ప‌డి చ‌చ్చే వాళ్ల సంఖ్య మిలియ‌న్ల‌లో ఉంటుంది. ధోని కోసమే క్రికెట్ చూసే వాళ్ల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అయితే ధోని అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్ పుణ్యామా అని ఇంకా మైదానంలో క‌నిపిస్తున్నాడు. చన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ గా ఉంటున్నాడు. కాగ ప్ర‌స్తుతం ధోని న్యూ లుక్ సోషల్ మీడియా లో తెగ వైర‌ల్ అవుతుంది.

ఎప్పుటి క‌ప్పుడు ట్రెండీ లుక్ లో ఉండే ధోని.. ఈ న‌యా లూక్ ప‌క్క‌ మాస్ గా ఉంది. అయితే ఐపీఎల్ 2022 ప్ర‌మోషన్ లో భాగంగా ఒక వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో వ‌దిలింది. ఖాకీ చొక్క‌, పాయింట్ తో ఊర మ‌స్ లుక్ తో అభిమానుల‌ను ధోని అల‌రిస్తున్నాడు. అచ్చం చెన్నై బ‌స్ డ్రైవ‌ర్ ల క‌నిపించే విధంగా మాస్ లుక్ తో ఉన్నాడు. కోర కోర మీసాల‌తో ధోనిని చూసి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. కాగ ఐపీఎల్ 2022 మార్చి 26 నుంచి ప్రారంభం కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news