ముంబై లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు బ్యాట్స్ మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంతి పడటమే ఆలస్యం.. బౌండరీలో ఉండాల్సిందే అన్నట్టు ఆడారు. దీంతో ఈ సీజన్ లో 200 మార్క్ దాటించిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు రికార్డు సృష్టించింది. కాగ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూర్.. ఓపెనర్లు గా ఫాఫ్ డుప్లెసిస్ (88) తో పాటు అండర్ – 19 స్టార్ అనుజ్ రావత్ (21) వచ్చాడు.
కాగ డుప్లెసిస్.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ కేవలం 57 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 7 సిక్స్ లు నమోదు చేశాడు. అలాగే విరాట్ కోహ్లి 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో ఒక ఫోర్, 2 సిక్స్ లు ఉన్నాయి. వీరికి తోడు దినేశ్ కార్తిక్ బ్యాక్ టూ బ్యాక్ బౌండరీలతో స్టేడియాన్ని హోరేత్తించాడు. కేవలం 14 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 3 సిక్స్ లతో విధ్వంసం సృష్టించాడు.
దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. పంజాబ్ గెలవాలంటే… 206 పరుగులు చేయాల్సి ఉంటుంది. అలాగే పంజాబ్ బౌలర్లు.. బెంగళూర్ బ్యాటర్ల దాటికి చేతులేత్తెశారు. అర్షదీప్ సింగ్, రాహుల్ చాహార్ తల ఒక వికెట్ తీసుకున్నారు.