‘పుష్ప-2’ పాటతో IPL 2025 ప్రారంభం

-

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025.. 18వ సీజన్ ప్రారంభమైంది. ప్రారంభ వేడుక అట్టహాసంగా జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం ప్రేక్షకులతో సందడిగా మారింది. వేదికపైకి మొదట ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ వేడుకలో ఎవరెవరు పర్ఫామెన్స్ ఇస్తారో ప్రకటించారు.

అనంతరం ఫేమస్ సింగర్ శ్రెయా ఘోషల్ దేశభక్తి గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత పుష్ప-2లోని సూసేకీ అగ్గిరవ్వ పాటతో వేడుకను ప్రారంభించారు. అలాగే భూల్ భులయ్యాలోని సాంగ్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. సంజు మూవీలోని కర్ హర్ మైదాన్ ఫతేహ్ పాటతో గూస్ బంప్స్ తెప్పించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అనంతరం ప్రముఖ గాయకుడు, రాపర్ కరణ్ ఔజ్లా ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news