SRH ఓపెనర్ల దండయాత్ర.. IPL చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోర్

-

ఐపీఎల్-2024లో మొదటి నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ విధ్వంసకర బ్యాటింగ్ తో దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఎగబాకుతోంది. ఐపీఎల్ చ‌రిత్ర‌ను బ‌ద్ధ‌లు కొట్టిన సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ఈసారి దిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌న ఊచ‌కోత కోస్తున్నారు. ట్రావిస్ హెడ్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దిల్లీకి తాము ఎంతపెద్ద త‌ప్పు చేసిందో తెలిసొచ్చింది. తొలి ఓవ‌ర్ నుంచే సిక్స‌ర్ల వేట మొద‌లెట్టిన హెడ్.. ఆ త‌ర్వాత ల‌లిత్ యాద‌వ్‌ను చిత‌క్కొట్టాడు. కేవ‌లం 16 బంతుల్లోనే యాభైకి చేరి ఈ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ 50 సాధించాడు.

పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసింది. అభిషేక్ (40), ట్రావిస్ హెడ్(84) బ్యాటింగ్ తో దండయాత్ర చేశారు. అయితే అభిషేక్ (46) వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన మాక్రమ్ కూడా వెంటనే ఔట్ అయ్యాడు. అలా దిల్లీ ప్లేయర్ కుల్దీప్ బ్యాక్ టూ బ్యాక్ రెండు వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version