ఐపీఎల్ 2022 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోష్ కొనసాగిస్తుంది. నేడు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. కాగ తొలుత మొదటి రెండు మ్యాచ్ లు ఓడి నిరుత్సహ పర్చినా.. తర్వాత వరుసగా నాలుగు విజయాలను అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్.. నాలుగో స్థానంలోకి ఎగబాకింది. కాగ నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 152 పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు.. సులువుగా చేధించారు.
కెప్టెన్ విలియమ్సన్ (3) విఫలం అయినా.. అభిషేక్ శర్మ (31), రాహుల్ త్రిపాఠి (34), ఐడెన్ మార్క్రమ్ (41 నాటౌట్), నికోలస్ పూరన్ (35 నాటౌట్) రాణించారు. కాగ సన్ రైజర్స్ కు గతంలో ఉన్న మిడిలార్డర్ సమస్య తీరింది. ప్రతి మ్యాచ్ లో మిడిలార్డర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ.. భారీ విజయాలని అందిస్తున్నారు. అలాగే బౌలింగ్ విభాగం కూడా బలంగా మారుతుంది. ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్ల పడగొట్టాడు. భూవనేశ్వర్ 3 వికెట్లు తీశాడు. నటరాజన్, సుచిత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.