ముంబై ఇండియన్స్ కి షాక్…?

ఈనెల 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ కి ముందు ముంబై ఇండియన్స్ కి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. జట్టు కీలక ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా గాయం బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో బూమ్రా కాలికి గాయమైంది. అయితే గాయం తీవ్రతను సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే గాయం చిన్నదాని కాకపోతే కాస్త విశ్రాంతి అవసరమని భావిస్తున్నారు.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మొదటి మ్యాచ్ కి బూమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై జట్టు యాజమాన్యం గాని కెప్టెన్ రోహిత్ శర్మ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నెల 19న ఇరుజట్లు అబుదాబి వేదికగా తలపడనున్నాయి. ప్రస్తుతం రెండు జట్లు కూడా ప్రాక్టీస్ సెషన్లో నిమగ్నమై ఉన్నాయి. బూమ్రా కు సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.