ముగిసిన రెండో దశ లోక్ సభ ఎన్నికలు

-

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్ 26న శుక్రవారం రోజు జరిగాయి. మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా. మొత్తంగా 16 లక్షలకుపైగా సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వాస్తవానికి రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ ను ఈసీ మే 7వ తేదీకి వాయిదా వేసింది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్ సభ స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. అన్ని విడుతల పోలింగ్ పూర్తి అయిన తరువాత జూన్ 04 ఫలితాలు వెలువడనున్నాయి. మే 07న మూడో విడుతలో 12 రాష్ట్రాల్లోని 94 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news