యూఏఈ వేదిక గా జరుగుతన్న టీ ట్వంటి వరల్డ్ కప్ తుది దశ కు చేరుకుంది. బుధవారం రాత్రి న్యూజిలాండ్ , ఇంగ్లాండ్ ల మధ్య మొదటి సెమీ ఫైనల్ పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో కేన్ విలియప్ సన్ నేతృత్వం లోని న్యూజి లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో న్యూజి లాండ్ టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు ను మొదటి బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. అయితే ఇంగ్లాండ్ ఓపెనర్లు అశించిన స్థాయి లో రాణించ లేక పోయారు.
కాని మిడల్ ఆర్డర్ లో వచ్చిన డేవిడ్ మాలన్ 41(30) తో పాటు మొయిన్ అలీ 51(37) రాణించడం తో ఇంగ్లాండ్ 166\4 గౌరవ ప్రదమైన స్కోర్ చేయకలిగింది. న్యూజి లాండ్ బౌలర్లు టీమ్ సౌథీ, మిల్నే, ఇష్ సోధీ, జమ్మీ నీషమ్ తలో ఒక వికెట్ తీశారు. అయితే 167 పరుగుల భారీ లక్ష్యంతో బరి లోకి దిగిన న్యూజిలండ్ కు ఆది లోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ మార్టీన్ గప్టిల్ స్వల్ప స్కోరు కే పెవిలియన్ బాట పట్టాడు. అలాగే కెప్టెన్ కేన్ విలియమ్ సన్ కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యాడు. న్యూజిలాండ్ మరొక ఓపెనర్ డారిల్ మిచెల్ 72(47) తో పాటు డెవాన్ కాన్వే 46 (38) మంచి ఇన్నింగ్స్ తో విజయానికి దగ్గరయ్యారు. చివరగా జెమ్స్ నీషమ్ 27(11) మూడు సిక్స్ లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటం తో విజయాన్ని అందుకున్నారు. కాగ ఈ మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా డారిల్ మిచెల్ అందుకున్నాడు.