IND vs NZ : రాణించిన భార‌త్ బ్యాట‌ర్లు ! కివిస్ టార్గెట్ 185

-

కోల్‌క‌త్త లోని ఈడెన్ గార్డెన్ వేదిక గా న్యూజిలాండ్ తో టీమిండియా మూడో టీ ట్వంటి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్లు న‌ష్ట పోయి 184 ప‌రుగులు సాధించింది. టాస్ నెగ్గి మొద‌ట టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిషాన్ లు శుభారంభం అందించారు. ఈ ఇద్ద‌రు భారీ షాట్ల తో టీమిండియా స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. వీరు మొద‌టి వికెట్ కు 69 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించారు. అయితే ఇషాన్ కిషాన్ 29 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాద‌వ్ సున్న ప‌రుగుల తో పెవిలియ‌న్ కు చేరాడు.

అయితే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 56 (31) 5 ఫోర్స్ 3 సిక్స్ ల‌తో వీర విహారం చేశాడు. అయితే ఇష్ సోధీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రిష‌బ్ పంత్ కూడా విఫ‌లం అయ్యాడు. వెంక‌టేష్ అయ్యార్ 20 (15), శ్రేయ‌స్ అయ్యార్ 25 (20) రాణించ‌డం తో స్కోర్ బోర్డులో మ‌ళ్లి క‌ద‌లిక వ‌చ్చింది. చివ‌ర‌కు హ‌ర్ష‌ల్ పటేల్ 18 (11), దీప‌క్ చాహ‌ర్ 8 బంతులలో నే 21 ప‌రుగులు రాబ‌ట్టాడు. దీపక్ చాహ‌ర్ దాటికి చివ‌రి ఓవ‌ర్ లో ఏకంగా 19 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో టీమిండియా నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 184 ప‌రుగులు సాధించింది. కాగ న్యూజి లాండ్ ఈ మ్యాచ్ గెల‌వాలంటే 185 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news