అమ్మమ్మతో అక్రమ సంబంధం… మనవరాలిపై అత్యాచారం…

రోజు రోజుకు దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వావీ వరసలు, చిన్నా పెద్దా తరతమ్యాలు మరిచిపోతున్నారు కామాంధులు. దిశ, నిర్భయ, పోక్సో వంటి ఎన్ని చట్టాలు వచ్చినా … కామాంధులు జడవడం లేదు. రోజుకు ఎక్కడోచోట అత్యాచార కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా తన మనవరాలి వయస్సు ఉన్న బాలికపై అత్యాచారం చేశారు. అంతకు ముందే బాలిక అమ్మమ్మతో సదరు వృద్ధుడి అక్రమ సంబంధాన్ని నెరుపుతున్నాడు.

rape

వివరాల్లోకి వెళితే … హైదరాబాద్ పాతబస్తిలో ఈ ఘటన బయటపడింది. 80 ఏళ్లు ఉన్నవృద్ధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాతబస్తీకి చెందిన బషీర్(80) అదే ప్రాంతానికి చెందిన మరో ఓ వృద్ధ మహిళతో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నాడు. అయితే సదురు వృద్ధురాలికి 11 ఏళ్ల మనవరాలు ఉంది. మనవరాలిపై కన్నెసిన వృద్ధుడు ఆమె పై అత్యాచారం చేశాడు. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన అమ్మమ్మ.. అతడిని నిలదీసింది. తనకేమీ తెలియదని ముందుగా బుకాయించాడు. అయితే ఆస్పత్రిలో టెస్టులు చేయగా అత్యాచార ఘటన బయటకువచ్చింది.