సౌతాఫ్రికాపై ఘన విజయం.. సెమీస్​ రేసులోకి పాక్​

-

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అదరగొట్టింది. పటిష్ఠమైన దక్షిణాఫ్రికాను 33 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) ఓడించింది.

టాస్​ గెలిచిన పాకిస్థాన్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. టాప్​ ఆర్డర్ విఫలమైనా.. షాదాబ్‌ ఖాన్‌ (52: 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51: 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయడం.. మహమ్మద్ హారిస్ (28: 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహమ్మద్‌ నవాజ్ (28: 22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. నవాజ్‌తో కలిసి 52 పరుగులు, షాదాబ్‌తో కలిసి ఇఫ్తికార్‌ 82 పరుగులు జోడించి కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆన్రిచ్‌ నోకియా 4.. పార్నెల్, రబాడ, ఎంగిడి, షంసి తలో వికెట్‌ తీశారు.

వ‌ర్షం కార‌ణంగా సౌతాఫ్రికా టార్గెట్‌ను 14 ఓవ‌ర్ల‌లో 142 ర‌న్స్‌కు కుదించారు. ఆ ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 14 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 108 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. దీంతో పాక్ 33 ర‌న్స్ తేడాతో విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. తాజా విక్ట‌రీతో గ్రూప్ 2లో నాలుగు పాయింట్ల‌తో పాక్ మూడ‌ో స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం ఇండియా, సౌతాఫ్రికాలు ఫ‌స్ట్ రెండు స్థానాల్లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version