సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రెండో టెస్టులో భాగంగా జోహన్నెస్ బర్గలో నేడు నాలుగోవ రోజు ఆడుతున్నారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడానికి ఆలస్యం అయింది. అయితే కాసేపటి క్రితం వరుణుడు శాంతించాడు. దీంతో ఫీల్డ్ పైన ఉన్న కవర్లను మైదనం సిబ్బంది తొలగించారు. అనంతరం అంపర్లు మైదానాన్ని పరిశీలించారు. దీంతో 7 : 15 గంటలకు మ్మాచ్ ప్రారంభం అవుతుందని అంపర్లు ప్రకటించారు. అయితే వర్షం కారణంగా మైదానం పరిస్థితి తో పాటు సమయం వంటి పరిస్థితుల కారణంగా ఈ రోజు ఆటను 34 ఓవర్లకే కుదించారు.
సాధారణంగా టెస్టు మ్యాచ్ లలో ఒక రోజు దాదాపుగా 90 ఓవర్లు ఉంటాయి. అయితే ఈ రోజు వర్షం కురవడంతో 56 ఓవర్లు వృథా అయ్యాయి. కాగ వర్షం ప్రభావం మ్యాచ్ ఫలితం పై తప్పక చూపే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. అయితే సౌత్ ఆఫ్రికా ఈ టెస్టు మ్యాచ్ లో ఇంకా 122 పరుగులు సాధించాలి. అలాగే ఇండియా విజయం సాధించాలంటే.. 8 వికెట్లను పడగొట్టాలి. ఈ రోజులో 34 ఓవర్లతో పాటు మరొక రోజు కూడా సమయం ఉంది.