మరణంపైనే చివరి ట్విట్ చేసిన షేన్ వార్న్… ట్విట్ చేసిన గంటల్లోనే హఠాన్మరణం

-

విధి ఎంత విచిత్రమైనదో ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతుంది. లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ విషయంలో కూడా విధి ఇలాగే చేసింది. తరుముకొస్తున్న మృత్యువు గురించి తెలియదు. కానీ తన చివరి ట్విట్ మాత్రం మరణంపైనే పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్విట్ చూసిన వార్న్ అభిమానులు, సగటు క్రికెట్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. 

లెజెండరీ స్పిన్నర్ తన మరణానికి కొన్ని గంటల ముందు  ఈరోజు ఉదయం 7.23 నిమిషాలకు చివరి ట్విట్ చేశాడు. ఆస్ట్రేలియా క్రిెకెట్ దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మరణించగా.. వార్న్ ఆయనకు నివాళి అర్పించాడు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు రాసుకొచ్చాడు. ఇంతలోనే కొన్ని గంటల వ్యవధిలోనే షేన్ వార్న్ గుండె పోటుతో కానరాని లోకాలకు చేరడం యావత్ క్రికెట్ అభిమానులను శోఖసంద్రంలో ముంచింది.

ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ తన నివాసంలో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. వార్న్ గుండె పోటుకు గురైనట్లు ప్రాథమికంగా నిర్థారించారు. వార్న్ మరణంతో యావత్ క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version