IND vs WI : నిల‌బ‌డ్డ శ్రేయ‌స్, పంత్.. వెస్టిండీస్ టార్గెట్ 266

-

వెస్టిండీస్, భార‌త్ మ‌ధ్య అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో మూడో వ‌న్డే జ‌రుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా నిర్ణిత 50 ఓవ‌ర్ల‌లో ప‌ది వికెట్లు కోల్పోయి 265 ప‌రుగులు చేసింది. కాగ ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి మొద‌ట బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఓపెన‌ర్లు రోహిత్ (13), శిఖ‌ర్ ధావ‌న్ (10) స్వ‌ల్ప స్కోరు కే వెనుతిరిగారు. అలాగే కోహ్లి డ‌కౌట్ తో మ‌రో సారి నిరాశ ప‌రిచాడు. దీంతో ప‌ది ఓవ‌ర్ల‌లో కీల‌కమైన మూడు వికెట్లు కోల్పోయి, కేవ‌లం 42 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

అప్పుడు క్రీజ్ లోకి వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్యార్ (80), వికెట్ కీప‌ర్ రిషబ్ పంత్ (56) ప‌రుగుల‌తో నిల‌బ‌డ్డారు. దీంతో స్కోరు ప‌రుగులు పెట్టింది. శ్రేయ‌స్, పంత్ క‌లిసి నాలుగో వికెట్ కు 110 ప‌రుగుల‌ను జోడించారు. వీరి త‌ర్వాత సూర్య కుమార్ నిరాశ ప‌ర్చ‌గా.. ఆల్ రౌండ‌ర్లు వాషింగ్టన్ సుంద‌ర్ (33), దీప‌క్ చాహ‌ర్ (38) ప‌రుగులు చేసి స్కోరు బోర్డును 250 మార్కును దాటించారు.

చివ‌రి ఓవ‌ర్లో హోల్డ‌ర్ రెండు వికెట్లు తీయ‌డంతో టీమిండియా చివ‌రి బంతికి ఆలౌట్ అయింది. దీంతో 265 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ బౌల‌ర్లు.. హోల్డ‌ర్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే అల్జారీ జోసెఫ్, హెడెన్ వాల్ష్ త‌ల రెండు వికెట్లు తీసుకున్నారు. ఓడియ‌న్ స్మిత్, ఫాబియ‌న్ అలెన్ ఒక్కోక్క వికెటు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news